'ఎన్నికల్లో లబ్ధిపొందే వారిపై విచారణ జరిపించాలి’

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొందరు ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీకి ప్రయత్నాలు చేస్తున్నారని నార్నూర్ మండల కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ ఆరోపించారు. ఈసందర్భంగా ఓటరు లిస్టులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సోమవారం సబ్ కలెక్టర్ యువరాజ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఒక చోట నుంచి మరో చోటుకి ఓటు బదిలీ చేసి అక్రమంగా ఎన్నికల్లో లబ్ధిపొందే వారిపై విచారణ జరపాలన్నారు.