VIDEO: హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన
కృష్ణా: గుడివాడలో వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై ట్రాఫిక్ ఎస్సై నాగరాజు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు.