పరిపాలన వ్యవస్థను మార్చే దిశగా పవన్ సమీక్ష

పరిపాలన వ్యవస్థను మార్చే దిశగా పవన్ సమీక్ష

AP: గ్రామీణ స్థాయిలో పరిపాలన వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు పవన్ సూచించారు. ప్రజల్లో సేవలపై మరింత సంతృప్తి పెరగాలంటే పరిపాలన వ్యవహారాలు మారాలని పేర్కొన్నారు. మ్యాజిక్ డ్రైయిన్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని తెలిపారు.