ఆర్యవైశ్యులపై అభిమానం.. అందుకే ఈ వేడుకలు అధికారికం
RR: ఆర్యవైశ్యులపై మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభిమానమని అందుకే ఈ వేడుకలు అధికారికంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని వాసవి మాత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు కులదైవంగా భావించే కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.