రజనీకాంత్ పేరుపై అరుదైన రికార్డు

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరుపై ఒక అరుదైన రికార్డు ఉంది. ఏ ఒక్క కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్‌లోనూ నటించని ఏకైక స్టార్ హీరోగా ఘనత అందుకున్నారు. తాను ఏ యాడ్ చేసినా తన అభిమానులు తనను గుడ్డిగా ఫాలో అవుతారని తెలిపారు. ఆ తర్వాత జరిగే లోటుపాట్లకు తానే బాధ్యుడిని అవుతానని, అలా వచ్చే సంపాదన నాకొద్దని పలు మార్లు రజినీ చెప్పారు.