భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు

భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయమైన భీమన్న ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న స్వామికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి అర్చనలు అభిషేక పూజలు చేసి సేవలో తరించారు.