VIDEO: రైతు మృతిపై ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య వాగ్వాదం
ATP: పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన రైతు నాగలింగమయ్య ఆత్మహత్య కలకలం రేపింది. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో రైతు కుటుంబాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి పరామర్శించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి శైలజనాథ్, ఎమ్మెల్యే శ్రావణి ఒకరికొకరు ఎదురుపడి వాగ్వాదానికి దిగారు. ఉదయం 6 గంటలకే పోస్టుమార్టం నిర్వహించడంపై శైలజనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.