టమాటా ధరలకు రెక్కలు

టమాటా ధరలకు రెక్కలు

TPT: యర్రావారిపాలెం మండలంలో టమటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు వారాంతపు మార్కెట్లో కిలో రూ.20 – 30కే లభించిన టమటా ఇప్పుడు రూ.60 – 80 వరకు పలుకుతోంది. ధరలు పెరగడంతో సాధారణ ప్రజలకు కూరగాయలు కొనడమే కష్టంగా మారింది. తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినడం, దిగుబడి తగ్గడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వ్యాపారులు అంటున్నారు.