ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి నియామకం
తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా గోకవరం మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన బత్తుల సత్తిబాబు నియమితులయ్యారు. టీడీపీలో సీనియర్ నాయకుడుగా ఉన్న సత్తిబాబు గతంలో జిల్లా వాణిజ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ అనుభవంతో అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా వృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు.