VIDEO: కుట్టు మిషన్ సెంటర్‌లో అధికారిపై మహిళలు ఫిర్యాదు
కోనసీమ: అమలాపురం బీసీ కార్పొరేషన్ కుట్టుమిషన్ శిక్షణ సెంటర్‌లో అధికారిపై మహిళలు ఫిర్యాదు చేశారు. తమ సౌకర్యాలపై ప్రశ్నించినందుకు అధికారి శ్రీనుబాబు తమను ఆన్‌లైన్ పరీక్ష నుంచి తొలగించారని అమలాపురం కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. శిక్షణ కేంద్రంలో కనీస వసతులు కూడా లేవని మహిళలు వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.