కుప్పగల్లు గ్రామంలో తిమ్మప్ప స్వామి ప్రత్యేక పూజలు
KNRL: ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ తిమ్మప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం, సందర్భంగా ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, తిమ్మప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. కార్తీక మాసంలో గ్రామ దేవాలయంలో జరిగే కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి దివ్య అనుగ్రహం పొందారు.