'మట్టి విగ్రహాలు వినియోగించండి'

'మట్టి విగ్రహాలు వినియోగించండి'

GNTR: తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం వినాయకుని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్ హాజరై మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని మట్టి విగ్రహాలను అందుకున్నారు. వాతావరణ కాలుష్యం నివారించడానికి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు.