శిక్ష శాతం పెంచేందుకు చర్యలు.. ఎస్పీ అభినందనలు
గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగిన ప్రాసిక్యూషన్ కమిటీ సమావేశంలో కేసులలో శిక్ష శాతం పెంచేందుకు తీసుకున్న చర్యలను ఎస్పీ శ్రీనివాసరావు సమీక్షించారు. ఇటీవల శాంతినగర్ కేసు, కోదండాపూర్ కేసు నిందితులకు కఠిన శిక్షలు పడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ రెండు కేసుల్లో కఠిన శిక్ష పడేలా దృఢంగా కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ బృందంను SP సన్మానించారు.