VIDEO: తండ్రి మృతి.. పరీక్షకు హాజరైన కొడుకు

VIDEO: తండ్రి మృతి.. పరీక్షకు హాజరైన కొడుకు

MDK: తండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు పరీక్షకు హాజరైన ఘటన తూప్రాన్ కేంద్రంలో చోటుచేసుకుంది. శివంపేట మండలం పాంబండకు చెందిన నాగరాజు, అంజమ్మ దంపతులు ఉసిరికపల్లి వద్ద రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడగా, నాగరాజు మృతి చెందాడు. ఈ రోజు శనివారం అంత్యక్రియలు జరగాల్సి ఉన్నప్పటికీ, తూప్రాన్ హైస్కూల్లో ఎస్ఎస్‌సీ పరీక్షకు కొడుకు ధనుష్ (16) హాజరయ్యాడు.