"పోలవరం కేంద్రంగా జిల్లా"ను ఏర్పాటు చెయ్యాలని వినతి

"పోలవరం కేంద్రంగా జిల్లా"ను ఏర్పాటు చెయ్యాలని వినతి

ELR: పోలవరం జిల్లా సాధన సమితి సభ్యులు సొబ్బన మోహన్ ఈరోజు పోలవరం ఎమ్మేల్యే చిర్రి బాలరాజును జీలుగుమిల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రధాన అంశంగా పోలవరం కేంద్రంగా చేస్తూ జిల్లాను ఏర్పాటు చెయ్యాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కాగా పోలవరం జిల్లా ప్రతిపాదనకు ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిర్రి బాలరాజుతో పాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి.