ఆటోనగర్ నిర్మాణానికి సహకరించాలని వినతి
PLD: ఆటోనగర్ నిర్మాణానికి, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే చదలవాడ సోమవారం కలెక్టర్ కృతిక శుక్లాను వినతి పత్రం అందజేశారు. ఉప్పలపాడు గ్రామంలో ప్రతిపాదిత ఆటోనగర్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. అలాగే, నియోజకవర్గ అభివృద్ధి పనులకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) నిధుల ద్వారా సహకారం అందించాలని పత్రంలో పేర్కొన్నారు.