'ఈ చిన్నారి వివరాలు తెలిస్తే చెప్పండి'
NDL: సంజామల మండలం ఉయ్యాలవాడ పట్టణంలో ఆరేళ్ల చిన్నారి నందిని ఒంటరిగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించి స్టేషన్‌కు తరలించారు. ఆ చిన్నారి తన తల్లిదండ్రుల పేర్లు లక్ష్మి, శ్రీను అని చెప్పిందని ఎస్సై రామిరెడ్డి తెలిపారు. ఈ చిన్నారి గురించి ఏమైనా వివరాలు తెలిస్తే ఎస్సై రామిరెడ్డి (9121101176), సీఐ మురళీధర్ రెడ్డి (9121101166) నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.