'ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన'

'ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన'

KKD: ప్రజలు ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కరప డిప్యూటీ ఎంపీడీవో సలాది శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం పాతర్లగడ్డలో పర్యటించిన ఆయన తడి, పొడి చెత్త సేకరణ, సంపూర్ణ పారిశుధ్యం, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను చైతన్య పరిచారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం గ్రామ పంచాయతీలు చేపడుతున్న కార్యక్రమాలకు గ్రామస్థులు సహకరించాలని కోరారు.