'రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

'రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

కాకినాడ: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. మంగళవారం జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్ రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు.