'ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ జరగాలి'
SRPT: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పూర్తిగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాల్సిందిగా సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం రాత్రి చివ్వెంల మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.