VIDEO: రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది: సతీశ్ రెడ్డి
కడప: సీబీఆర్, పైడిపాలెం ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా.. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతో బోర్లలో నీటిమట్టం తగ్గిపోతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.