ఈనెల 10న టాస్క్ కేంద్రంలో జాబ్ మేళా

ASF: జిల్లా కేంద్రంలోని టాస్క్ కేంద్రంలో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి రవికృష్ణ ప్రకటనలో తెలిపారు. హెటిరో కంపెనీలో జూనియర్ ఆఫీసర్ 40, జూనియర్ కెమిస్ట్/ ట్రెయినీ 100, జూనియర్ ఇంజినీర్/ట్రెయినీ 200 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 77022 84181 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.