సిబ్బంది తొలగింపుతో కొండెక్కిన పర్యవేక్షణ..!

సిబ్బంది తొలగింపుతో కొండెక్కిన పర్యవేక్షణ..!

VSP: విశాఖ స్టీల్‌ ప్లాంటులో కీలక విభాగమైన రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ (ఆర్‌ఎంహెచ్‌పీ)ను సరైన ప్రణాళిక లేకుండా నిర్వహిస్తున్నారని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒప్పంద కార్మికుల తొలగింపు, కన్వేయర్‌ల నిర్వహణ కొరవడటం, కీలక అధికారుల బదిలీ వంటి పరిణామాలు ఆర్‌ఎంహెచ్‌పీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఉక్కు ఉత్పత్తి వ్యయం పెరుగుతుందంటున్నారు.