పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన DGP

పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన DGP

ADB: జిల్లా పర్యటనకు విచ్చేసిన డీజీపీ శివధర్ రెడ్డి గురువారం రాత్రి నూతనంగా పున: నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించారు. ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించిన ఆయన సిబ్బంది, అధికారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దినందుకు అభినందించారు. అనంతరం డీజీపీ, ఐజీలు, ఎస్పీ కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటి, పచ్చదనం పెంపొందించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.