జిల్లాకు రెండు సంచార చేపల విక్రయ వాహనాలు

జిల్లాకు రెండు సంచార చేపల విక్రయ వాహనాలు

KMR: జిల్లాకు చెందిన ఇర్ఫానా బేగం(నిజాంసాగర్), స్వప్న (దోమకొండ)లకు నీలి విప్లవం పథకం కింద 2 సంచార చేపల విక్రయ వాహనాలు మంజూరయ్యాయి. ఈ వాహనాలను మత్స్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సోమవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రజా భవన్‌లో పంపిణీ చేశారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ వాహనాలను అందుకున్నారు.