'కేసుల విచారణ దశలో పోలీసుల పాత్ర కీలకం'
NRML: కేసుల విచారణ దశలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు, సాక్ష్యాధారాల సమర్పణ, హాజరు శాతం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. ప్రతి ఆఫీసర్ కోర్టు హాజరులో న్యాయపరమైన ప్రామాణికత పాటించాలని సూచించారు.