పిటిఎం మీటింగ్ వాయిదా
NRML: బీసీ బంద్ నేపథ్యంలో ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే పిటిఎం (పేరెంట్ టీచర్స్ మీటింగ్) రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు డిఇఓ భోజన్న ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు విషయాన్ని ఆయా ఎంఈఓ లు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని వారు కోరారు.