VIDEO: కలెక్టరేట్లో ప్రతిధ్వనించిన గీతం

VIDEO: కలెక్టరేట్లో ప్రతిధ్వనించిన గీతం

MDK: వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ సముదాయ ఆవరణలో శుక్రవారం సామూహిక గీతాలాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. వందేమాతర గేయం దేశభక్తిని, స్వాతంత్ర్య సమరయోధుల్లో జాతీయ జ్వాలను రగిలించిన పాట అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు పాల్గొని గీతాన్ని ఆలపించారు.