VIDEO: “స్వరాంధ్ర–స్వచ్ఛాంధ్ర” ర్యాలీ

కృష్ణా: గన్నవరం(M) వీరపనేనిగూడెంలో డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాల ఆధ్వర్యంలో “స్వరాంధ్ర–స్వచ్ఛాంధ్ర” ర్యాలీ శనివారం నిర్వహించారు. వర్షాకాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, క్యాంపస్ శుభ్రత, వృక్షారోపణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వై.యశోద లక్ష్మి తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ ఉషారాణి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.