నేడు గంటపాటు లైట్లు బంద్ చేయండి

నేడు గంటపాటు లైట్లు బంద్ చేయండి

BDK: పర్యావరణ పరిరక్షణ కోసం ఎర్త్ అవర్ పాటించాలనే సంప్రదాయం 2007లో మొదలైంది. ఈసారి మార్చి 28 రాత్రి 8:30 నుంచి 9:30 గం. వరకు గంటపాటు అనవసర విద్యుత్ దీపాలను ఆర్పి వేసి అందరూ భాగస్వాములు కావాలని జిల్లాలోని పర్యావరణ ప్రేమికులు ఇవాళ పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడం, సుస్థిర భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఈ చిన్న ప్రయత్నం పర్యావరణంలో పెద్ద మార్పు తెస్తుందన్నారు.