కుడి ప్రధాన కాలువకు సాగునీరు విడుదల

కుడి ప్రధాన కాలువకు సాగునీరు విడుదల

SKLM: వంశధార కుడి ప్రధాన కాలువలు సాగునీటి ప్రవాహం అందుకుంది. రైతుల సాగునీటి అవసరాలకు కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెట్టామని సోమవారం వంశధార ఏఈ శ్రీనివాసరావు  తెలిపారు. కుడి ప్రధాన కాలువ ద్వారా హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్ మండలాలకు చెందిన సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.