బొత్సతో జీవీ భేటీ
VSP: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీలో జోనల్-1 ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన జీవీ రవిరాజు ఇవాళ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా ఆ పదవి ఇచ్చినందుకు జీవీ, బొత్సకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రచార కమిటీ ద్వారా సహకరిస్తామని హామీ ఇచ్చారు.