ఎస్సారెస్పీ వరద కాలువ మట్టి అక్రమ రవాణా

ఎస్సారెస్పీ వరద కాలువ మట్టి అక్రమ రవాణా

WGL:రాయపర్తి మండలంలో ఎస్సారెస్పీ వరద కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తూ అక్రమార్కులు లాభాలు ఆర్జిస్తున్నారు. కాలువ ఇరువైపుల ఉన్న మట్టి దిబ్బలను ఖాళీ చేసి, ప్రస్తుతం నేరుగా కాలువ మట్టినే తరలిస్తున్నారు. ఇళ్ల, వ్యాపార నిర్మాణాలకు డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాలని శుక్రవారం స్థానికులు కోరుతున్నారు.