108 అంబులెన్స్‌‌ను తనిఖీ చేసిన ఆడిట్ అధికారి

108 అంబులెన్స్‌‌ను తనిఖీ చేసిన ఆడిట్ అధికారి

NZB: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని నియోనేటల్ (శిశు) 108 అంబులెన్స్‌ను EMIR గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. వాహనంలోని మందులు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర సమయాల్లో మరింతనాణ్యమైన సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని సిబ్బందికి సూచించారు.