క్వారీ యాజమాన్యంపై కేసు నమోదు

క్వారీ యాజమాన్యంపై కేసు నమోదు

SKLM: మెళియాపుట్టి మండలం దబ్బగూడ పరిధిలో ఓ గ్రానైట్ క్వారీలో అనుమతి లేకుండా చేపట్టిన పేలుళ్లతో ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటనకు సంబంధించి క్వారీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారని పాతపట్నం సీఐ రామారావు ఆదివారం సాయంత్రం తెలిపారు. క్వారీలో తవ్వకాలకు అనుమతులు లేని పేలుడు సామగ్రి వినియోగించడంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.