విమానాల రాకపోకలు ప్రారంభం
UAE నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అబుదాబి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించినట్లు విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి 6 విమానాలు టేకాఫ్ అయినట్లు తెలిపారు. ఢిల్లీ, ఇస్లామాబాద్, ముంబై, కరాచీ, మాస్కో, పారిస్, ఆమ్‌స్టర్‌డామ్, లండన్ నగరాలకు విమానాలు బయలుదేరాయి. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.