'పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలి'
ATP: గుత్తి కౌన్సిల్ హాల్లో సోమవారం స్వచ్చంద్ర, స్వర్ణాంధ్ర పై వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శుభ్రత మీద ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్లాస్టిక్‌ని ప్రతి ఇంటి, పరిసరాలలో వాడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.