భీమవరంలో గీత కార్మికులు ధర్నా
W.G: భీమవరం ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గీత కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్సై సునీల్ కుమార్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. నరసింహమూర్తి మాట్లాడుతూ.. అన్నపూర్ణా లాంటి ఏపీను 'మద్యం ప్రదేశ్'గా మార్చాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.