'విభునాయర్‌ను కలిసిన MP నగేశ్'

ADB: కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి విభునాయర్‌ను ఎంపీ నగేశ్ ఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు, సంక్షేమ పథకాల బడ్జెట్ విడుదల, రోడ్లు, తదితర మౌలిక వసతుల కల్పన అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు నగేశ్ పేర్కొన్నారు.