'తప్పులు లేని ఓటరు జాబితాకు సహకరించాలి'

'తప్పులు లేని ఓటరు జాబితాకు సహకరించాలి'

PPM : తప్పులు లేని ఓటరు జాబితాకు రాజకీయ పార్టీలు సహకరించాలని గజపతినగరం నియోజకవర్గ ఓటు నమోదు అధికారి ప్రమీలగాంధీ కోరారు. బుధవారం గజపతినగరం తహసిల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితాపై సదస్సు జరిగింది. స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని, ఇంకా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలన్నారు. తహసిల్దార్ రత్న కుమార్ పాల్గొన్నారు.