'గుంటూరులో పచ్చదనం పెంపొందించేందుకు కృషి'
GNTR: పారిశుద్ధ్య లోపం వల్ల డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 'స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ గుంటూరు' కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ వద్ద ఆయన మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, దీనివల్ల పర్యావరణానికి చాలా ఉపయోగకరమన్నారు. గుంటూరులో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.