కంటి శస్త్ర చికిత్స కేంద్రం ఏర్పాటు

కంటి శస్త్ర చికిత్స కేంద్రం ఏర్పాటు

WNP: ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి శస్త్ర చికిత్స కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం తెలిపారు. ఇందులో క్యాటరాక్ట్ సర్జరీలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిలో దాదాపు 50 నుంచి 60 శస్త్ర చికిత్సలు చేశారని, ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని తెలియజేశారు.