అమ్మవారి పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

RR: యాచారం మండలం గడ్డ మల్లయ్యగూడ గ్రామంలో నేడు పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. పునఃప్రతిష్ట మహోత్సవానికి భారీగా భక్తులు తరలి రావడంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది.