'గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ'

VZM: బొబ్బిలి మండలం కోటిపల్లిలో ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు సెంటర్ మేనేజర్ రాజేష్ బుధవారం తెలిపారు. శిక్షణలో msoffice, softskills ఉంటాయని, టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి 18-30 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులని తెలిపారు. 3నెలల శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.