పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదుకావాలి: కలెక్టర్

మెదక్: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని 100% ఓటింగ్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మాసాయిపేట మండలం రామంతపూర్ నూతన పోలింగ్ స్టేషన్ ను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల మౌలిక వసతులను అందుబాటులో ఉంచుతామన్నారు.