మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం

మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం

AKP: మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరవాడ మండలం వెన్నెల పాలెంలో యాంటీ డ్రగ్స్ ఎక్స్ పో కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. జిల్లాలో 64 పాఠశాలల నుంచి హాజరైన 500 మంది విద్యార్థులు 150 నమూనాలను ప్రదర్శించారు. ఆకట్టుకున్న నమూనాలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేశారు.