భారత యువ ఆర్చర్లకు గ్లోబల్ ఛాన్స్

కెనడాలోని విన్నిపెగ్‌లో ఇవాళ ప్రారంభమయ్యే ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్ 2025 కోసం 24 మంది భారత ఆర్చర్లు సిద్ధమయ్యారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో 63 దేశాల నుంచి 570 మంది యువ ఆర్చర్లు పాల్గొంటున్నారు. అండర్-18, అండర్-21 విభాగాల్లో రికార్వ్, కాంపౌండ్ ఈవెంట్లలో వీరు పోటీ పడనున్నారు. ఇది భారత యువ ఆర్చర్లకు తమ నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి మంచి అవకాశం.