ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: సీపీ
NZB: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్నిసీపీ సాయిచైతన్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... పోలీస్ సిబ్బంది 24/7 విధి నిర్వహణలో ఉంటారని, ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.