జైలులో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి
HYD: చంచల్‌గూడ జైలులో మూడు రోజుల వైద్య శిబిరాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని, ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా HIV అవేర్‌నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు.