VIDEO: రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు
శ్రీకాకుళం: ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో గురువారం ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో ముమ్మరంగా డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గంజాయి అక్రమ నిల్వలు, విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.